దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న వారిలో సమంత ఒకరు.గత దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
అదేవిధంగా సమంత అక్కినేని ఇంటి కోడలిగా అడుగు పెట్టి అనంతరం పలు కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో అగ్రతారల లిస్టులో హీరోయిన్ రష్మిక పేరు కూడా ఉంటుంది.
ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే తాజాగా ఈ ఇద్దరి అగ్ర హీరోయిన్ల మధ్య ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇద్దరు ముద్దుగుమ్మలు అగ్రతారగా కొనసాగుతూనే మరోవైపు ఎన్నో కమర్షియల్ యాడ్స్ ద్వారా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.ఇలా ఒక వైపు సినిమాలలోను మరొకవైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ రెండుచేతులా డబ్బులు సంపాదిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ పట్టు సారీ షోరూం తమ షోరూంకు ప్రచారకర్తలుగా వ్యవహరించాలని వీరిద్దరిని సంప్రదించడమే కాకుండా ఈ ఇద్దరికీ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట.

ఇక ఈ ఆఫర్ ను సమంత ఎంతో సున్నితంగా తిరస్కరించిందని వార్తలు షికార్లు చేయడంతో ఇదే అదునుగా భావించి రష్మిక ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోయి సమంత పై కామెంట్లు చేస్తున్నారు.సమంత రష్మిక పక్కన నటించడానికి భయపడింది.ఇలా రష్మిక పక్కన సమంత నటిస్తే తన క్రేజ్ ముందు సమంత తేలి పోతుందని భయపడి ఈ ఆఫర్ వదులుకుంది అంటూ రష్మిక అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.
ఇక ఈ విషయంపై రంగంలోకి దిగిన సమంత అభిమానులు కామెంట్ చేస్తూ మరి ఇది కాస్త ఓవర్ గా ఉన్నట్టు లేదు… రష్మికకు సమంత భయపడటం ఏంటి అంటూ పెద్దఎత్తున సమంత అభిమానులు రష్మిక ఫ్యాన్స్ కి చురకలు అంటిస్తున్నారు.







