ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా( Urvashi Rautela ) గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు.
అయితే హీరోయిన్గా కంటే కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యారని చెప్పాలి.ఇలా స్పెషల్ సాంగ్స్( Special Songs ) ద్వారా భారీ స్థాయిలో సంపాదిస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలలో స్పెషల్ సాంగ్ అంటే ఊర్వశి ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయారు.
ఒక్కో పాటకు దాదాపు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటూ ఎంతో క్రేజీ సొంతం చేసుకున్నటువంటి ఈమె తాజాగా రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద( Skanda ) సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈ బ్యూటీ ఫ్యాషన్ ఐకాన్ అనే విషయం చెప్పాల్సిన పని లేదు.ఎప్పటికప్పుడు హాట్ లుక్స్, మెస్మరైజ్ చేసే కాస్ట్యూమ్స్ తో ఈ భామ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు.
ఇక ఈమె ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.
సెప్టెంబర్ 28న ఊర్వశి రౌతేలా ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసింది.ఫ్లేర్డ్ జీన్స్, హాల్టర్ నెక్ క్రాప్ టాప్, డెనిమ్ జాకెట్‌తో సూపర్ స్టైలిష్ గా దర్శనమిచ్చింది.ఇలా ఎయిర్పోర్టులో సందడి చేసిన ఈమె చేతిలో ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
దీంతో ఈమె చేతిలో ఉన్నటువంటి ఈ హ్యాండ్ బ్యాగ్ ధర ఎంత అని పెద్ద ఎత్తున ఈ బ్యాగ్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.ఫెండి ఎక్స్ వెర్సెస్ గోల్డ్ బరోక్ ఎఫ్ఎఫ్ మోటిఫ్ ఫెండేస్ సన్‌షైన్ టోట్( Fendi X Versace Fendance Tote Bag ) బ్యాగ్ ధర $6,342 USD.మన కరెన్సీలో చెప్పాలంటే రూ.5,27,657.57.అంటే 5 లక్షల పైనే అనే విషయం తెలియడంతో హ్యాండ్ బ్యాగ్ ( Expensive Hand Bag ) కోసం ఇన్ని లక్షలు ఖర్చు చేయాలా అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు.