ఈ నెల 2వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( pawan kalyan )పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రికార్డ్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం పలు సేవా కార్యక్రమాల ద్వారా మంచి మనస్సును చాటుకుంటున్నారు.పవన్ సేవా సంస్థ ద్వారా కొంతమంది పవన్ అభిమానులు 2.10 లక్షల రూపాయలు ఖర్చు చేసి కట్టించారు.స్థలం ఉన్న మహిళకు పవన్ అభిమానులు అండగా నిలిచారు.
పవన్ సేవా సంస్థ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ పవన్ ను స్పూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వాళ్లు చెబుతున్నారు.పది మందిని కలుపుకుని పది మందికి సాయం చేస్తున్నామని వాళ్లు వెల్లడిస్తున్నారు.ఈవిడ కుటుంబ కష్టాలు తెలిసి సాయం చేయాలనే ఆలోచనతో ఇల్లు కట్టించామని పవన్ సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు.
పవన్ పుట్టినరోజున( Pawan Kalyan Birthday ) ఈ ఇంటి గృహ ప్రవేశం జరగడం గమనార్హం.
పవన్ సేవా సంస్థ సాయం పొందిన ఈ మహిళ పేరు సంతోషి కాగా రెండేళ్ల క్రితం భర్త చనిపోయారని ఆమె చెప్పారు.శ్రీకాకుళం జిల్లా మండస మండలానికి చెందిన ఈ మహిళ పవన్ సేవా సమితి చేసిన సహాయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.సంతోషికి ఇద్దరు కూతుళ్లు కాగా ఇల్లు లేని సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని వాళ్లు చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్( Fans ) చేసిన ఈ పనిని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.పవన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా ఈ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
పవన్ కళ్యాణ్ ( pawan kalyan )తర్వాత సినిమాలతో భారీ విజయాలను అందుకుని రికార్డులు తిరగరాయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పవన్ కళ్యాణ్ వరుస విజయాలు సాధించాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.