గత కొద్దిరోజులుగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.ఈ సినిమా కన్నడ హీరో రిషబ్ శెట్టి తన స్వీయ దర్శకత్వంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇందులో కర్ణాటకలోని కొన్ని తెగల వారు ఎంతో విశ్వసించే భూతకోల నృత్య ప్రదర్శన ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ సినిమాలో ఈ భూతకోల ప్రదర్శన ఎంతో ఆసక్తికరంగా అందరిని ఆకట్టుకుంది.
ఇకపోతే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సైతం ఈ భూతకోల నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు.తాజాగా ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి తన సొంత గ్రామమైన మంగళూరుకు వెళ్లారు అక్కడ భూతకోల ప్రదర్శన వేయడంతో అనుష్క శెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ భూత కోల ప్రదర్శనలో భాగంగా అనుష్క అక్కడ సన్నివేశాలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ ఉన్నారు.ఈ ప్రదర్శనకు ఈమె ఎంతో సాంప్రదాయ బద్ధంగా పట్టు చీరను ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక అనుష్క బాహుబలి తర్వాత ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.అయితే ఈమె తాజాగా యు వి క్రియేషన్ నిర్మాణంలో నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇందులో అనుష్క చెఫ్ పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది.