సూర్యాపేట జిల్లా: మునగాల ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నుండి ప్రజా పాలన ప్రత్యేక కౌంటర్లు ప్రారంభమవుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు.
శనివారం మండల కేంద్రంలోని తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీచేశారు.అనంతరం కార్యాలయంలోని వివిధ శాఖలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.సోమవారం నుండి ప్రారంభం కానున్న ప్రజాపాలన కౌంటర్లను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.