యాదాద్రి భువనగిరి జిల్లా:వరుస సెలవుల నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించాల్సిన జాతీయ లోక్ అదాలత్ ను తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ ఈ నెల 16తేదీకి మార్పు చేసినట్లు చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.సత్వర కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి అవకాశమని,కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,రాజీ మార్గమే రాజ మార్గమని అన్నారు.
కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు,న్యాయవాదులు కృషి చేయాలని కోరారు.







