రైతులకు అక్కరకురాని రైతు వేదికలు...!

సూర్యాపేట జిల్లా: రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు ఉపాధిహామీ నిధులతో పాటు వ్యవసాయశాఖ నిధులు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రూ.573 కోట్లతో 2604 రైతు వేదికలను నిర్మించిన విషయం తెలిసిందే.ఈ రైతు వేదికల ద్వారా రైతులంతా ఒకేచోట చేరి వ్యవసాయం ముచ్చట్లు, సాగుచేసే పంటల గురించి చర్చించుకోవడం, సభలు, సమావేశాలు, నిర్వహించడంతో పాటు గోడౌన్‌ గా ఉపయోగ పడతాయని భావించారు.ప్రతి ఐదు వేల ఎకరాల సాగు విస్తీర్ణాని వ్యవసాయ క్లస్టర్‌గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈఓ)లను నియమించారు.ఒక్కో వేదిక నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు రూ.22 లక్షలు ఖర్చు చేసి నిర్మించారు.

 Rythu Vedika Centres Are Not In Use, Rythu Vedika Centres , Rythu Vedika, Farmer-TeluguStop.com

ఇంత ఖర్చు పెట్టీ గత ప్రభుత్వo నిర్మించిన వేదికలు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో పిచ్చి చెట్లతో నిండిపోయి పడావుబడి,మూతపడి పోయినవి.ఈ వేదికలలో ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడమే కాక పశువులకు జంతువులకి నివాస స్థావరలుగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అయినా అధికారులు ఇదంతా చోద్యం చూస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని రైతుల అవసరాల కోసం, లాభసాటి పనులకు వినియోగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube