సూర్యాపేట జిల్లా:మోతె మండల పరిధిలోని రాంపురంతండా రెవెన్యూ పరిధిలోని ఎస్సారెస్పీ 22 ఎల్ కెనాల్ ఆక్రమణకు గురైందని వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలకు నీటిపారుదల శాఖ అధికారులు స్పందించారు.సోమవారం ఆక్రమణకు గురైన ఎస్సారెస్పీ కాలువను సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇరిగేషన్ డిఈ రెడ్డిమల్ల నాగేష్ మాట్లాడుతూ ఎస్సారెస్పీ 22ఎల్ కెనాల్ ను ఆక్రమణదారుడు రెండు, మూడు రోజుల్లో పునరుద్ధరణ చేయకపోతే కేసు నమోదు చేస్తామని, ఆక్రమణ చేసిన కాలువ కట్టపై మొక్కలు నాటుతామని,మరి కొందరు కుడా అక్రమణ చేశారని వారికి కూడా ఇదే విషయం చెబుతున్నామని తెలిపారు.దీనితో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.
గత కొన్నేళ్లుగా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని,వార్తా కథనాలు రావడంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందని, ఇప్పటికైనా స్పందించిన ఇరిగేషన్ అధికారులకు, రైతు సమస్యను వెలుగులోకి తెచ్చిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.