దశాబ్దమైనా రోడ్డు పూర్తి చెయ్యలేదని కాంగ్రెస్ ధర్నా

Congress Protested That The Road Has Not Been Completed For A Decade , Battula Lakshmareddy, Jodo Yatra

నల్లగొండ జిల్లా:రాష్ట్ర మంత్రి,ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోని భీమారం – సూర్యాపేట రహదారి తొమ్మిదేళ్లుగా పూర్తికాక పోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వేములపల్లి మండలం సల్కునూరు అడ్డరోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టినట్లు కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రచారం చేసుకుంటున్న అధికార పార్టీ నేతలు,ఈ రోడ్డు పనులు ఎందుకు పెండింగ్ ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు.

 Congress Protested That The Road Has Not Been Completed For A Decade , Battula L-TeluguStop.com

అనంతరం బొమ్మకల్లు,గణపతి వారిగూడెం,దేవతల బాయిగూడెం,తోపుచర్ల, పుచ్చకాయల గూడెం గ్రామంలో జోడో యాత్ర నిర్వహించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్, డీసీసీ ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి,జడ్పిటిసి పుల్లెంల సైదులు,కిరణ్ తదితరులు పాల్గొన్నారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube