అనుమతి లేకుండా నిర్మాణం చేస్తే కఠిన చర్యలు తప్పవు: కమిషనర్

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా మరియు అనుమతి లేకుండా భవన నిర్మాణలు చేసిన వారికీ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ సూర్యాపేట జిల్లా కోర్టు జరిమానా విధించినట్లు సూర్యాపేట మున్సిపల్ కమీషనర్ పి.రామానుజుల రెడ్డి శుక్రవారం తెలిపారు.

 Strict Action Will Be Taken Against Construction Without Permission Commissioner-TeluguStop.com

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా అదనంగా నిర్మాణాలు మరియు అనుమతి లేకుండా భవనాలు నిర్మించిన 26 మందిఫై కోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు.ఈ నేపథ్యంలో ముగ్గురు గృహా యజమానులఫై జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ సూర్యాపేట కోర్టు జరిమానా విధించినట్లు కమిషనర్ వివరించారు.

ధామిడి అశోక్ రెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి,వినోద టాకీస్ రోడ్ వారికీ రూ 48683/- లు, ప్రగాఢపు ఉషారాణి భర్త మల్లేశ్వర్ రావు,చర్చి కంపౌండ్ వారికీరూ 20943/-కొండ సౌభాగ్య వతి భర్త రాజయ్య మరియు కొండ రాజయ్య తండ్రి కనకయ్య,కుడ-కుడ రోడ్డు వారికీ రూ 46703/- లు జరిమానా విధించగా వారు జరిమానా డీడిలను కోర్టు సమర్పించగా ఆ డిడిలు మున్సిపాలిటి తీసుకోవడం జరిగిందన్నారు.సూర్యాపేట పట్టణ ప్రజలు నిబంధనలకు అనుగుణంగా ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకొని అనుమతి మేరకే గృహాలు నిర్మాణాలు చేయాలని కమిషనర్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube