ధరణి పోర్టల్ రద్దు చేయాలని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

సూర్యాపేట జిల్లా:ధరణి పోర్టల్ రద్దు చేయడంతో పాటు, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు రైతు భీమా, రైతు రుణమాఫీ,పోడు భూములు,పంటలకు గిట్టుబాటు ధర,ధాన్యం కొనుగోలు ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధులైన కాల్వ సుజాత చకిలం రాజేశ్వర రావులతో కలిసి భారీ ఎత్తున రైతులు,నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఆర్డీవోకి మెమొరాండం సమర్పించారు.

 Dharna In Front Of Rdo Office To Cancel Dharani Portal-TeluguStop.com

ఈ సందర్భంగా రైతుల పాడుతున్న కష్టాలను,సమస్యలను తాహాసిల్దార్ కు వివరించారు.అనంతరం చెవిటి వెంకన్నయాదవ్,కాల్వ సుజాత మాట్లాడుతూ లక్ష రూపాయల రైతు రుణమాఫీ హామీ వెంటనే అమలు చేయాలన్నారు.

కౌలు రైతు చట్టం అమలు చేయాలని,పోడు రైతులకు పట్టాలు ఇచ్చి అటవీ హక్కుల చట్టం అమలు చేయాలని కోరారు.ధరణి పోర్టల్ వెంటనే ఎత్తివేసేందుకు భూమున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల పిలుపునిచ్చారు.24లక్షల ఎకరాల భూముల వివరాలు ధరణిలో కనిపించడం లేదని,తక్షణమే భూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని,పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని,ప్రభుత్వం వెంటనే అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములపై ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల 05 వ తేదీన ధరణి బాధితులతో కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ల రమేష్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్,జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడు అమరవరపు శ్రీనివాస్,పెన్ పహాడ్ మండల పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు,ఆత్మకూర్ (ఎస్) మండల పార్టీ అధ్యక్షుడు కందాల వెంకట్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తంగెళ్ల కరుణాకర్ రెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షుడు కుంట్ల వెంకటనాగిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలగాని బాలుగౌడ్,డీసీసీ కార్యదర్శులు రుద్రంగి రవి,పిడమర్తి మల్లయ్య,అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్,జిల్లా సేవాదళ్ చీఫ్ ఆలేటి మాణిక్యం,పట్టణ ఐఎన్టీయూసి అధ్యక్షుడు వల్దాసు శ్రీను (రెబల్),పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ యలగందుల సాయినేత ,జిల్లా కాంగ్రెస్ నాయకులు రేతినేని శ్రీనివాస రావు, గార్లపాటి వెంకట్ రెడ్డి,సత్యనారాయణ రెడ్డి,శిగ శ్రీను,కోడి కుమార్ యాదవ్, గుణగంటి సైదులు,ఖమ్మంపాటి మధు, శివ నాయక్,పల్సా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube