తెలంగాణా ఐకాన్ జయశంకర్ సార్

తెలంగాణా ఏర్పాటుకు అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు.ఆయన ఆశయసిద్ధికి అనుగుణంగా కేసీఆర్ పాలన.

 Telangana Icon Jayashankar Sir-TeluguStop.com

ఘనంగా దివంగత ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి-మంత్రి జగదీష్ రెడ్డి.

సూర్యాపేట జిల్లా:తెలంగాణా రాష్ట్రానికి దివంగత ఆచార్య జయశంకర్ సార్ ఐకాన్ లాంటి వారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు.తెలంగాణా రాష్ట్ర సాధన కొరకు జీవిత చరమాంకం వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడని పేర్కొన్నారు.దివంగత ఆచార్య జయశంకర్ సార్ 11 వ వర్ధంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను ఆంద్రప్రదేశ్ లో కలిపిన రోజునే బలంగా వ్యతిరేకించిన యోధుడు జయశంకర్ సార్ అని గుర్తు చేశారు.అటువంటి మహానుబావుడి సంకల్పసిద్ధికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారని, ఈ రోజున సార్ జీవించి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తాను కన్న కలలు సాకారం అవుతున్నందుకు ఎంతగానో సంబురపడేవారని అన్నారు.

తెలంగాణా వెనుకబాటుకు గురైన ప్రాంతం కాదని వెనుకబాటుకు నెట్టివేయబడిన ప్రాంతమంటూ వేల సభలలో జయశంకర్ సార్ చేసిన ఉపన్యాసాలను మంత్రి జగదీష్ రెడ్డి గుర్తుచేశారు.అటువంటి సహజ వనరులను సద్వినియోగ పరుచుకొని ఎనిమిదేండ్ల పాలనలో యావత్ భారతదేశంలోనే తెలంగాణాను ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు వరుసలో నిలబెట్టారన్నారు.

అద్భుతమైన విజన్,అంతకుమించి చక్కటి పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత తోటే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాదించిందన్నారు.ఇది ఎవరో చెబితే తెలిసింది కాదని,ఎనిమిదేండ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు స్వయానా కేంద్ర ప్రభుత్వమే కితాబునివ్వడం ఇందుకు అద్దం పడుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి చెందిన గ్రామాల లిస్ట్ లో ఒకటి నుండి పందొమ్మిది వరకు తెలంగాణా రాష్ట్ర పల్లెలు ఉండడం,పట్టణాల వరుసలోను ఒకటి నుండి పది వరకు కేంద్రప్రభుత్వ లిస్ట్ లో ముందుండడమే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు తార్కాణంగా అభివర్ణించారు.అంతకు మించి వేగవంతమైన వ్యవసాయ అభివృద్ధి,విద్యుత్ రంగంలో సాధించిన అద్భుతమైన విజయాలతో పాటు పారిశ్రామిక రంగంలో కొత్తగా ప్రకటించిన పాలసీ ప్రపంచాన్ని ఆకర్షిస్తోందన్నారు.

అంటే జయశంకర్ సార్ ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పాలన నిదర్శనమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ,జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube