సూర్యాపేట జిల్లా: తిరుమలగిరి పట్టణంలో కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులు తరిమితరిమి కొట్టడంతో పట్టణ కేంద్రం రణరంగంగా మారింది.మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తిరుమలగిరి పట్టణ తెలంగాణ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్,కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడానికి వస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎల్సూజి నరేష్,పాలకుర్తి రాజయ్య,గంట అమరేందర్ రెడ్డిలను అక్కడే మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు
మంత్రి జన్మదినం చేస్తుంటే దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తారా అనుకున్నారేమో కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను దొరికిన వారికి దొరికినట్లు ఉరికించి కొట్టారు.
దీనితో తెలంగాణ చౌరస్తా రణరంగమై ఏం జరుగుతుందో తెలియక ప్రజలు,ప్రయాణికులు భయాందోళన చెందుతూ పరుగులు తీశారు.ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారని కాంగ్రెస్ నాయకుల ఆరోపిస్తున్నారు.