యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో మునుగోడు ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన చర్చా వేదికను కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.దీనితో రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతుల పక్షాన పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మాపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రాచకొండ పోడు భూములకు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
గాంధీల పాలనలో వ్యవసాయ రంగానికి బాటలు పడ్డాయని,నేటి పాలకులు వ్యవసాయాన్ని దగా చేస్తున్నారని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏపూరి సతీష్,సీనియర్ నాయకులు రాసముల యాదయ్య,మందుగుల బాలకృష్ణ,రత్తుపల్లి యాదయ్య,గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి,పజ్ణనాయక్, బైకని నరేందర్ యాదవ్, మినుగు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.