నేరేడుచర్ల సమీకృత మార్కెట్ కు ఏ గ్రహణం పట్టింది

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల పట్టణంలో మంజూరైన సమీకృత మార్కెట్ కు ఏ గ్రహణం పట్టిందని,పట్టిన గ్రహణాన్ని వదిలించి వెంటనే మార్కెట్ నిర్మాణం చేపట్టాలని నేరేడుచర్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేరేడుచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే చేస్తున్నామని చెప్పుకునే హుజూర్ నగర్ ఎమ్మెల్యే,స్థానిక టిఆర్ఎస్ నాయకులు సమీకృత మార్కెట్ ను ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

 What Is The Eclipse Of The Integrated Market Of Nereduchar?-TeluguStop.com

పేద వ్యాపారస్తుల కోసం నేరేడుచర్ల సెంటర్లోని జాన్ పహాడ్ రోడ్ లో గత 55 సంవత్సరాల నుండి ఎన్ఎస్పి శాఖ ఆధీనంలోని స్థలాన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం నేరెడుచేర్ల మున్సిపాలిటీకి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేశారని,ఆ పనులకు టెండర్లు కూడా పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చారని,ఆ స్థలాన్ని మున్సిపాలిటీ వాళ్ళు కాంట్రాక్టర్ కు స్వాధీనపరిచారని,కాంట్రాక్టర్ కొంత పని మొదలుపెట్టిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు,పట్టణ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోర్టులో ఆ స్థలం తమదని కేసు వేసి స్టే తేవడం జరిగిందని ఆరోపించారు.మున్సిపాలిటీకి వచ్చిన నిధులను 15 కోట్ల రూపాయలు మున్సిపల్ కౌన్సిలర్లకి తెలియకుండా స్థానిక శాసనసభ్యులు, కలెక్టర్ కలిసి సీక్రెట్ గా టెండర్లు పెట్టించి కౌన్సిలర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన పనికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కోర్టులో కేసు వేసి స్టే తెస్తే కాంగ్రెస్ వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పదేపదే బదనాం చేసే ఎమ్మెల్యే,స్థానిక టిఆర్ఎస్ నాయకులు ఎందుకు వారి నాయకుడు స్టే తెస్తే మాట్లాడుతలేదో దానిలో అంతర్యం ఏమిటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

పదేపదే అభివృద్ధి మంత్రం జపించే టిఆర్ఎస్ నాయకుల్లారా గత రెండు సంవత్సరాల క్రితం హడావుడిగా కేటీఆర్ ని తీసుకొచ్చి స్థానిక ఎమ్మెల్యే పార్కు శంకుస్థాపన చేశారని,వేసిన శిలాఫలకాన్ని తీసి మున్సిపల్ స్టోర్ రూమ్ లో పెట్టించడం జరిగిందని,టెండర్లకు పిలవటం జరిగిందని కానీ,టెండర్ లో పని దక్కించుకున్న కాంట్రాక్టర్ కి నేటికీ వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా పనులు మొదలు పెట్టించకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు.టిఆర్ఎస్ అభివృద్ధి అంటే శంకుస్థాపనలు చేయడం, శిలాఫలకాలు వేయడం,వాటిమీద పేర్లు చెక్కించుకోవడం తప్ప పనులు మాత్రం చేసేది లేదని ఎద్దేవా చేశారు.

ఏ పని మొదలు పెట్టినా పూర్తి చేయలేని దుస్థితిలో స్థానిక శాసనసభ్యులు ఉన్నారనేది అందరూ గమనించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రకాష్,నాగయ్య,జిల్లా కాంగ్రెస్ నాయకులు రామకృష్ణారెడ్డి,పాండు నాయక్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఖాదర్,పిచ్చిరెడ్డి, కృష్ణమూర్తి,కొనతం నర్సిరెడ్డి,మచ్చ శ్రీను,సైదా నాయక్,గజ్జల కోటేశ్వరరావు,నరసింహ,జానీ,సతీష్, గోవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube