సూర్యాపేట జిల్లా: తెలంగాణాలో మళ్ళీ కేసీఆర్ హవా మొదలైందని,కేసీఆర్ వస్తేనే తమకు శ్రీరామ రక్ష అని ప్రజలు నమ్ముతున్నారని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారానికి జగదీశ్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
సూర్యాపేట రూరల్ మండలం సోలిపేట,సూర్యాపేట మున్సిపాలిటీ మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పలు వార్డులలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు.ప్రచారానికి వెళ్లిన సందర్భంగా హారతులు నివాళులతో మహిళలు అపూర్వ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ కక్షపూరిత వైఖరి,నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలే మాకు వివరిస్తున్నారని అన్నారు.కాంగ్రెస్,బీజేపీ ఇద్దరు తోడు దొంగలేనని, వారి సిద్ధాంతాలను రాద్దాంతాలను ప్రజలు గమించారన్నారు.
కాంగ్రెస్, బీజేపీ లోపాయకారి ఒప్పందాలు ఒక్కొక్కొటిగా బహిర్గతమైతున్నాయని, బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల రద్దు పేరుతో మొత్తం రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తుందని అరోపించారు.
బీజేపీ వ్యాపారస్తులపార్టీ, ప్రజలను మరింత బీద వాళ్ళను చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని విమర్శించారు.
ప్రజల్లో సెంటిమెంటు రగిల్చి పబ్బం గడిపేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు.ప్రజలని ఆకలితో ఉంచాలనే దుర్మార్గమైన సిద్ధాంతం కోసం బీజేపీ పని చేస్తుందని మండిపడ్డారు.
నోటీసుల డ్రామాతో మోడీతో రేవంత్ లోపాయికారి అవగాహన ఒప్పంద్దం బయటపడిందన్నారు.ఆ ఒప్పందంలో భాగమే రేవంత్ కి నోటీసుల డ్రామాలని ఆరోపించారు.
బీజేపీకి రేవంత్ తో ఒప్పందం లేకుంటే కవితను అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.మీడియాలో ప్రచారం కోసం,ప్రజలను మోసగించేందుకే రేవంత్ నోటీసుల డ్రామా అన్నారు.
కాంగ్రెస్,బీజేపీ ఒక్కటేనని ప్రజలకు అర్ధమౌతుందని, ఆరు రోజుల కేసీఆర్ పర్యటనతో వార్ వన్ సైడే అన్నారు.కేసీఆర్ సభలకు ప్రజలు స్వచ్ఛంద్దంగా పోటెత్తుతున్నారని,మారిన పరిస్థితుల్లో 16 కి 16 బీఆర్ఎస్ కైవసం చేసుకోనున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్ర పరిస్థితుల్లో మార్పు తధ్యం అన్నారు.