సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో మంగళవారం పట్ట పగలే బైక్ డిక్కీ పగులగొట్టి రూ.3లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే.పట్టణానికి చెందిన అడ్వకేట్ రవికిషోర్( Ravikishore ) కు డబ్బు అవసరమై పక్కంటి వ్యక్తిని వడ్డీకి అడగాడు.అతను బ్యాంకులో ఉన్నాయి,డ్రా చేసుకొని వద్దామని రవికిషోర్ ను వెంటబెట్టుకొని ఎస్బీఐ బ్యాంకు దగ్గరికి బైక్ మీద వెళ్లారు.డబ్బులు డ్రా చేసుకొని బైక్ డిక్కీలో పెట్టి ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు.
డబ్బును డిక్కిలోనే ఉంచి,ప్రామిసరీ నోటురాసిచ్చి బయటికి వచ్చి,బైక్ డిక్కీలో ఉన్న డబ్బును మరొకరికి వ్యక్తికి ఇద్దామని బైక్ దగ్గరకు రాగానే డిక్కీని పలగగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు అందులో ఉన్న మూడు లక్షలు రూపాయలు పట్టపగలే ఎత్తుకెళ్లారు.దొంగతనం జరిగిన దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.
దీనితో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.డబ్బుపోయి 24 గంటలైనా న్యాయం చేయలేదని అడ్వకేట్ రవికిశోర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.