ఆరు గ్యారంటీలను అమలు తప్పక చేస్తాం:పద్మావతి రెడ్డి

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రజలకు మేలు చేసే ఆరు గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామని కోదాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మావతి రెడ్డి అన్నారు.శనివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని గోపతండా,గొల్లగూడెం, నేరేడువాయి, తుమ్మగూడెం, నర్సింహపురం, రంగాపురంతండా,కూడలి, రామునితండా,రావికుంట తండా,సర్వారం గోల్ తండ, మబుర్కచర్లతో పాటు పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

 Six Guarantees Must Be Implemented Padmavati Reddy, Congress Six Guarantees , Pa-TeluguStop.com

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హస్తం గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.మేము సేవా భావంతో రాజకీయాల్లోకి వచ్చామని,అవకాశం ఇస్తే కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మోతె ఎంపీపీ ఆశా రెడ్డి, జడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు, మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి,మాజీ సింగిల్ విండో చైర్మన్ మైనంపాటి గురువారెడ్డి,కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ మదిరెడ్డి మధుసూదన్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి మాతృనాయక్, మండల నాయకులు నూకల మధుసూదన్ రెడ్డి, అంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సామ వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube