వీఆర్ఏల వంటా వార్పుకు కేవీపీఎస్ మద్దతు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద జరిగిన వీఆర్ఏ వంట వార్పు కార్యక్రమానికి కెవిపిఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి మాట్లాడుతూ గ్రామ సేవకుల సమ్మె పట్ల ముఖ్యమంత్రి మొండివైఖరి విడనాడడం లేదని, విఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె న్యాయమైందని, ధర్మపోరాటమని,ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి వారి డిమాండ్లు పరిష్కరించి నిరవధిక సమ్మెను విరమింప జేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 Kvps Supports Warping Like Vras-TeluguStop.com

ముఖ్యమంత్రి మూడు విడతలుగా వీఆర్ఏలకు ఇచ్చిన వాగ్దానం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు? వీఆర్ఏలలో అత్యధికులు దళిత బహుజనులే ఉన్నారని,అందుకే సీఎం వివక్ష చూపుతున్నారని విమర్శించారు.పేస్కెల్ గొంతెమ్మ కోరిక కాదని,సీఎం ఇచ్చిన వాగ్ధానమేనని గుర్తు చేశారు.

ప్రభుత్వం బేషజాలకు పోకుండా తక్షణమే వీఆర్ఏ జేఏసితో చర్చలు జరిపి పే స్కెల్,వారసులకు ఉద్యోగాలు అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీలో సీఎం తన మనసు తరుక్కపోతుందని అందులో అత్యధికులు బలహీనవర్గాల వారని,వారంతా మా పేద బిడ్డలని వారికి తప్పక పే స్కెల్ అమలు చేస్తానని చెప్పి నేడు నోరు మెదపడం లేదని చెప్పిన మాటలు మరిచిపోయారా అని ఎద్దేవా చేశారు.

వీఆర్ఏలకు సంఘీభావంగా కేవీపీఎస్ పోరాడుతుందని,సమ్మెకు వెనుకాడకుండా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరాటంకంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల జేఏసీ ఛైర్మన్ మధుసూదన్ రావు,జేఏసీ నాయకులు నర్సయ్య,వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube