ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధనం

సూర్యాపేట:కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి మోసం చేసిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్,ఎమ్మెస్సీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట రూరల్ మండలం టేకుమట్ల వద్ద 65వ జాతీయ రహదారిని దిగ్బంధం చేసి రాస్తారోకో నిర్వహించారు.అనంతరం జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేయడంతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది.

 Blockade Of National Highway Under Mmrps-TeluguStop.com

దీనితో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకుల అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఇన్చిన మాట ప్రకారం వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.

లేనియెడల రాబోయే కాలంలో బీజేపీ ని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube