ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధనం
TeluguStop.com
సూర్యాపేట:కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి మోసం చేసిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
ఎమ్మార్పీఎస్,ఎమ్మెస్సీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట రూరల్ మండలం టేకుమట్ల వద్ద 65వ జాతీయ రహదారిని దిగ్బంధం చేసి రాస్తారోకో నిర్వహించారు.
అనంతరం జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేయడంతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది.
దీనితో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకుల అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఇన్చిన మాట ప్రకారం వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.
లేనియెడల రాబోయే కాలంలో బీజేపీ ని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ పేరు తలుచుకుంటే చాలు ఆక్సిజన్ లభిస్తుంది: చంద్ర బోస్