సూర్యాపేట జిల్లా:యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోని,వ్యాపారాల అభివృద్ధితోనే ఉపాధి మార్గాలు పెరుగుతాయని,నాణ్యమైన సేవలతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు.శుక్రవారం అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామంలో బీపీసీయల్ పెట్రోల్ బంక్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.తాము ఉపాధి పొందడంతో పాటు,మరో 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
నాణ్యమైన సేవలతో వినియోగదారుల మన్ననలను పొందాలన్నారు.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోదాడ పరిసర ప్రాంతాలు అన్ని వ్యాపారాలకు అనువుగా ఉంటుందన్నారు.
గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బంక్ ను రైతులు,ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు.బంకు యజమానులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు రమేష్,పట్టణ పార్టీ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు,సర్పంచ్ లీలావతి బాబురావు, ఎంపిటిసి కృష్ణవేణి హరీష్,టిఆర్ఎస్ నాయకులు ఒంటిపులి నాగరాజు,ఉపేందర్ గౌడ్, మాగి యాకోబు,గంగురి శ్రీనివాస్,మురళి కృష్ణ,శ్రవణ్,నిర్వాహకులు భిక్షపతి,జయరాజు ,బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు.