నల్లగొండ జిల్లా: వీఐపీ యాప్ లో పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతుందని నమ్మించిన కేటుగాళ్లు జనం చేత చైన్ సిస్టం ద్వారా కోట్లలో పెట్టుబడులు పెట్టించి బురిడీ కొట్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మొదట్లో కొందరికి ప్రాఫిట్ ఆశ చూపి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించారు.
పెట్టిన పెట్టుబడికి ప్రాఫిట్ రాకపోవడంతో భాదితులకు అనుమానం వచ్చి చూడగా
యాప్ బ్లాక్ అవ్వడంతో మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు.రెట్టింపు డబ్బు వస్తుందన్న ఆశతో అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టిన కొందరు భాదితులు మోసపోయామని తెలుసుకుని వందలాది మంది భాదితులు నల్లగొండ డీఎస్పీ శివరామ్ రెడ్డిని ఆశ్రయించారు.
డీఎస్పీ శివరామ్ రెడ్డి నేతృత్వంలో నల్గొండ రూరల్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టినట్లు సమాచారం.మహారాష్ట్రలోని పూణే వేదికగా యాప్ ఆపరేట్ అయినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు.