సూర్యాపేట జిల్లా:నెల 6 వ తేదీ నుండి ప్రారంభమయ్యే బహుజన రాజ్యాధికార యాత్రని విజయవంతం చేయాలని,ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని,బహుజన రాజ్యంలో ప్రజలే పాలకులని,మన రాజ్యం కోసం అందరం కలిసి పనిచేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,సుర్యాపేట జిల్లా ఇంచార్జ్ పిల్లుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.బుధవారం మేళ్లచెరువు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ బహుజన రాజ్యాధికార పాదయాత్రకు జిల్లా నుండి బహుజన వాదులు అధిక సంఖ్యలో తరలిరావాలని అన్నారు.
రాష్ట్రంలో అందరి పాలన చూశామని,అందరూ బహుజన వర్గాలకు అన్యాయం చేశారని తెలిపారు.బీఎస్పీ ద్వారా ఆర్ఎస్పీ సారధ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం సాకారమవుతుందన్నారు.
ఎస్సి,ఎస్టీ, బీసీ,మైనార్టీ,అగ్రకుల పేదలు ఏకమై సాగాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఇంచార్జీ డా.కేశగాని సాంబశివ గౌడ్పి,పిడమర్తి దశరథ,కొండమీద నరసింహ,మంద రవి మరియు నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.