సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలో ఓపెన్ జిమ్ లేకపోవడంతో యువకులు కోదాడ,సూర్యాపేట పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నడిగూడెం మండల కేంద్రంలో జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసినట్లుగా మునగాల మండల కేంద్రంలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చొరవ తీసుకొని ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
పట్టణాలకు వెళ్లి జిమ్ చేయాలంటే అధిక ఫీజులు కట్టి,ఛార్జీలు భరిస్తూ ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.మధ్యతరగతి,సామాన్య కుటుంబాల యువకులు డబ్బులు కట్టి జిమ్ కి వెళ్ళడం భారంగా మారిందని అంటున్నారు.
మండల కేంద్రంలో అధికారులు స్థలాన్ని గుర్తించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, స్థానిక జెడ్పీ హైస్కూల్ కు రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు,యువకులు,మార్నింగ్ వాక్ కు వస్తుంటారని,అక్కడే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని స్థానిక యువకుడు సిరికొండ అజయ్ అంటున్నారు.