రాయినిగూడెం పిఏసిఎస్ వ్యవహారంపై రోడ్డెక్కిన రైతులు...!

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం రాయినిగూడెం సహకార సంఘంలో చోరీ జరిగి 15 రోజులు కావస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక దాగి ఉన్న ఆంతర్యమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం అఖిలపక్ష నాయకులు రైతులతో కలిసి మిర్యాలగూడ కోదాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.అనంతరం అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రాయినిగూడెం పిఎసిఎస్ పాలకవర్గాన్ని రద్దు చేసి బ్యాంక్ సీఈఓని తొలగించాలని డిమాండ్ చేశారు.

 Farmers Protest Over Rainigudem Pacs Issue Detals, Farmers Protest ,rainigudem P-TeluguStop.com

సహకార సంఘం కుంభకోణంపై తక్షణమే విచారణ జరిపి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

బ్యాంకులో చోరీ జరిగినట్లు గుర్తించిన అధికారులు విచారణలో ఎందుకు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.

తక్షణమే దొంగలను గుర్తించి చోరీ డబ్బులను రికవరీ చేయాలని,సహకార సంఘం చైర్మన్,సీఈవో పాలకవర్గంపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం పోలీసుల హామీతో ధర్నా విరమించారు.

ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, రైతులు,రైతు సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube