ప్రస్తుతం సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ కొంత కాలం మాత్రమే కొనసాగుతున్నారు.ఒకప్పుడు మంచి నటనతో ఎన్నో సవంత్సరాలు కొనసాగే వారు.
తమ స్టార్ డమ్ ను అలాగే కొనసాగించే వారు.కానీ ఆ తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి.
ఇప్పుడు హీరోయిన్లు మహా అంటే 5 నుంచి 6 సంవత్సరాలు మాత్రమూ లైమ్ లైట్ లో ఉంటున్నారు.అయితే ఉన్నంతలోనే మంచి సినిమాలు చేయాలి అనుకుంటున్నారు పలువురు హీరోయిన్లు.
అయితే కొందరు హీరోయిన్లు చేసిన సినిమాలు.వారు తప్ప మరొకరు చేయలేరు అనే భావన కలిగించేలా ఫర్ఫెక్ట్ నటనతో అదరగొట్టారు.ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
కమలిని ముఖర్జీ- ఆనందర్
ఆనంద్ సినిమా వచ్చిన సమయంలో కమలిని ముఖర్జీ పేరు తెలుగు సినిమా పరిశ్రమలో మార్మోగింది.ఇంత డీసెంట్, స్వంతంత్ర భావాలు కలిగిన సినిమాలో కమలిని త్ప మరొకరు చేయలేరు అనే భావన కలిగించేలా నటించింది.శేఖర్ కమ్ముల కమలిని పాత్ర తీర్చిదిద్దిన తీరు చాలా ఆకట్టుకుంది.
కీర్తి సురేష్- మహానటి
ఈ సినిమాలో అచ్చం అలనాటి నటి సావిత్రిని మక్కీకి మక్కీ దింపినట్లు నటించింది కీర్తి.ఈ పాత్రలో కీర్తి తప్ప మరొకరు చేయడం కష్టం అనిపించేలా నటించింది.
సాయి పల్లవి- ఫిదా
అచ్చం పల్లెటూరు పిల్లలా నటించి జనాలను ఫిదా చేసింది సాయి పల్లవి.ఈ సినిమాతో తన నటన, చెప్పిన డైలాగులు అదరగొట్టాయి.
నిత్యా మీనన్- మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
నేచురల్ నటి నిత్యా మీనన్ ఈ సినిమాలో అద్భుత నటన కనబర్చింది.తనలోని నటననా శక్తిని తెర మీద పరిచింది.
అనుష్క-అరుంధతి
లేడీ ఓరియెంటెడ్ మూవీ అరుంధతిలో అనుష్క నట విశ్వరూపం చూపించింది.తన నటనకు జనాలు దాసోహం అయ్యారు.
కలర్స్ స్వాతి- అష్టాచెమ్మ
ఈ సినిమాలో అల్లరి పిల్లలా స్వాతి నటన ఎంతో ఆకట్టుకుంది.తను బయట ఎలా ఉంటుందో.సినిమాలో కూడా అలాగే నటించి ఆకట్టుకుంది.
జెనీలియా- బొమ్మరిల్లు
తన అమాయకపు నటనతో పాటు సెంటిమెంటును రంగరించి అద్భుతంగా నటించింది జెనీలియా.పలు సీన్లలో నవ్వుతో పాటు ఏడ్పు వచ్చేలా చేసింది.
నివేదితా థామస్- జెంటిల్మెన్
ఈ సినిమాలో ఆమె చక్కటి నటనతో ఆకట్టుకుంది.తన క్యారెక్టర్ లో జీవించి నటించింది.ఎమోషన్ సీన్స్ లో కంటతడి పెట్టించింది.
పాయల్ రాజ్ పుత్- RX 100
ఈ సినిమాలో నెగెటివ్ షేడ్ లో కనిపించింది పాయల్.తన రొమాంటిక్ నటనతో అందరినీ ఆకట్టుకుంది.