హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్,భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో ఆయన నివాసంలో డాక్టర్ వడ్డేపల్లి రవి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆయనతో పాటు తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మరియు పలు సంఘల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అనంతరం డాక్టర్ వడ్డేపల్లి రవి మీడియాతో మాట్లాడుతూ నా ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి,రాహుల్ గాంధీకి,టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి,ప్రత్యేకంగా తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.