గులాబీ కండువా ఉంటేనే దళితబంధు ఇస్తారా:ఏపూరి సోమన్న.

సూర్యాపేట జిల్లా:అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం,కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తూ మిగతా దళితులను మోసం చేస్తోందని వైఎస్సార్ టిపి తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ ఏపూరి సోమన్న ఆరోపించారు.శుక్రవారం వైఎస్సార్ టిపి ఆధ్వర్యంలో తిరుమలగిరి మండల కేంద్రంలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.

 Do You Give Dalit Bandhu Only If You Have A Pink Scarf: Epuri Somanna.-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారన్నారు.తుంగతుర్తి నియోజకవర్గంలో కేవలం టీఆర్ఎస్ నాయకులకు,కార్యకర్తలకే దళిత బంధు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇచ్చేంతవరకు వైఎస్సార్ టిపి పోరాదుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టిపి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జిల్లపెల్లి వెంకటేశ్వర్లు నాయుడు,కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిపాల వేణు యాదవ్,జిల్లా ప్రధాన కార్యదర్శి ధనియాల శంబయ్య,ఏపూరి చందు,అనుబంధ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube