సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ బోర్డ్ అధికారుల తీరు కుక్క తోకకు గుండ్రాయి కట్టినట్లుగానే ఉందని పలువురు విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోమవారం కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ నిర్వహకులు షాక్ ఇచ్చారు.
ఇంగ్లీష్ ప్రశ్నా పత్రానికి బదులుగా కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం ఇవడంతో విద్యార్థులు కంగారు పడ్డారు.సెంటర్ నిర్వాహకులు ఈ విషయాన్ని ఇంటర్ బోర్డ్ అధికారులకు తెలియజేయడంతో నాలుక కరుచుకున్న ఇంటర్ బోర్డు నిర్వహకులు ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం పంపి,గంటన్నర ఆలస్యంగా పరీక్ష నిర్వహించారు.
గంటన్నర ఆలస్యంగా పరీక్ష నిర్వహించడంతో ఆ సెంటర్ లో పరీక్షకు హాజరైన 243 మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.ఇంటర్ బోర్డా మజాకా???