బాలీవుడ్ బ్యూటీ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో లాకప్.కంగనా రనౌత్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించిన విభిన్నమైన రియాల్టీ షో లాకప్.ఇందులో పాటిస్పేట్ చేసిన కంటెస్టెంట్స్ నుంచి వారు చెప్పిన సీక్రెట్ వరకు ప్రతి ఒక్కటి కూడా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ లు వారి జీవితంలో జరిగిన ఎన్నో విషయాల గురించి ఈ షోలో చెప్పుకొచ్చారు.ఇది ఇలా ఉంటే ఈ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.
ఈ షోలో ఫైనల్ విన్నర్ తాజాగా ప్రకటించింది హోస్ట్ కంగనా రనౌత్.కాంట్రవర్సీ రియాల్టీ షో లాకప్ సీజన్ వన్ బాడీయాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ అని ప్రకటించింది.
ఈ షోలో రన్నరప్ గా నటి పాయల్ రోహత్గీ నిలిచింది.ఈ షో విన్నర్ మునావర్ ఫరూఖీ ఈ ట్రోఫీని గెలుచుకోవడంతో పాటు 20 లక్షల చెక్కు ని అలాగే మారుతి సుజుకి కారు, అదేవిధంగా ఇటలీకి వెళ్లే ఫ్రీ టిప్ ను అందుకున్నాడు.
ఫినాలే ఎపిసోడ్ లో విన్నర్ మునావర్ ఫరూఖీ ఇతర నలుగురు కంటెస్టెంట్ లు పాయల్ రోహత్గి, అంజలి అరోరా , అజ్మా ఫల్లా,శివమ్ శర్మ లను ఓడించి విన్నర్ గా గెలిచాడు.

ట్రోపీని గెలుచుకున్నందుకు మునావర్ ఫరూఖీ అనంత ఉబ్బితబ్బిబ్బైయ్యాడు.ఇకపోతే ఎందుకు సంబంధించిన ఎపిసోడ్ మే 7 న ఎంఎక్స్ ప్లేయర్ ఆల్ట్ బాలాజీ లో ప్రసారం అయిన విషయం తెలిసిందే.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చూసిన అభిమానులు మునావర్ ఫరూఖీ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మునావర్ ఫరూఖీ విన్నర్ అని తెలియగానే మొదటి ఎమోషనల్ అయ్యాడు.








