కార్మికులకు న్యాయం చేయాలి:బీర్ల

యాదాద్రి జిల్లా:కష్టపడి పని చేస్తున్న కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం నెరవేర్చాలని టీపీసీసీ డెలిగేట్ మెంబర్,ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్ లిమిటెడ్ కాంపెనీలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడుతూ ప్రీమియర్ కార్మికులకు 20 శాతం వార్షిక బోనస్,25 శాతం ఎక్స్ గ్రేషియా అందజేయాలన్నారు.

 Justice Should Be Done To Workers: Birla-TeluguStop.com

కంపెనీ యాజమాన్యం యూనియన్ తో కుమ్మకై కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు.ఇప్పుడున్న యూనియన్ నాయకుడు మహేందర్ రెడ్డికి కార్మికుల బాధలు తెలియవని,రాజాకీయల కోసం యూనియన్ అధ్యక్షుడుగా అయ్యాడన్నారు.1965 లోనే కార్మికుల చట్టం ప్రకారం బోనస్ అందజేయాలని ఉండగా,ఈ కంపెనీ 7 కోట్ల లాభాల్లో నడుస్తున్నా 8.33 శాతం బోనస్ ఇవ్వటం సిగ్గుచేటని అన్నారు.రూ.21వేల సాలరీ ఉన్న కార్మికుడికి కూడా బోనస్ ఎక్స్ గ్రేషియా అందజేయాలన్నారు.ఈ అసమర్ధత నాయకుడిని ఎన్నుకున్నందుకే కార్మికులకు నష్టం కలుగుతోందని, కనీసం 20 శాతం బోనస్ ఇవ్వటం లేదని మండిపడ్డారు.కార్మికులు చేసే దీక్షలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube