సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గానికి టూరిస్టుల్లా వచ్చే వారికి నియోజకవర్గ సమస్యలు ఏం తెలుసని కోదాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ గ్రామ శివారులో ఉన్న ఫంక్షన్ హాల్లో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎలక్షన్లో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి మళ్లీ ఇప్పుడు నియోజవర్గంలో కనిపించిందని ఎద్దేవా చేశారు.నియోజవర్గ ప్రజల మీద ఎన్నడూ లేని ప్రేమ ఎన్నికలప్పుడే గుర్తొచ్చిందా అన్నారు.
ప్రతిఒక్క యువకుడు ఒక సైనికుల్లాగా పనిచేసి బీఆర్ఎస్ విజయంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.