సూర్యాపేట జిల్లా:దళిత స్పీకరుని అడ్డుపెట్టుకుని కుంటిసాకుతో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ ని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం సిగ్గుచేటని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడుతూ
జగదీష్ రెడ్డి దళితుల పక్షపాతి అని,
రైతుల కష్టాలు,6 గ్యారెంటీలు, అభివృద్ధి,సంక్షేమాలపై నీలదీస్తున్న ప్రజాగొంతుకను సస్పెండ్ చేయడం సరికాదన్నారు.
పేటలో జనరల్ స్థానంలో దళిత మహిళను మున్సిపల్ చైర్మన్ చేసిన ఘనత జగదీష్ రెడ్డిదని,జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవడాన్ని దళిత సమాజం ఖండుస్తుందన్నారు.స్పీకర్ రాజకీయాలకతీతంగా వాస్తవాలు పరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.