రెండో విడత గొర్రెల పంపిణీపై లబ్ధిదారుల ఆందోళన...!

సూర్యాపేట జిల్లా: జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ పథకం పూర్తిగా నిలిచిపోయిందని జిల్లాలో డీడీ చెల్లించిన గొల్ల కురుమలు వాపోతున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సబ్సిడీ గొర్రెల యూనిట్ల పథకాన్ని ప్రవేశపెట్టింది.

 Beneficiaries Concern Over Second Phase Of Sheep Distribution, Beneficiaries , S-TeluguStop.com

మొదటి విడతలో కొంతమందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు.తిరిగి రెండో యూనిట్లకు అప్పటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు డీడీలు స్వీకరించారు.

మునుగోడు ఉప ఎన్నికలకు ముందు డీడీలు చెల్లించి వారిలో కొందరికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు.ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ సందర్భంగా మిగతా వారికి పంపిణీ చేయలేదు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏడదిన్నర మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సుమారుగా 31,850 మంది గొల్లకురుమల నుండి జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో డీడీలు స్వీకరించింది.గొర్రెల పంపిణీకి సంబంధించిన ప్రభుత్వం ఒక లబ్ధిదారునికి యూనిట్ కింద 20 గొర్రెలతో పాటు ఒక పొట్టేలును అందించింది.వీటి విలువ సుమారు రూ.1,58,000 గా నిర్ణయించింది.అయితే ప్రభుత్వం సబ్సిడీ పోను దీంట్లో లబ్ధిదారుని వాటా ధనం కింద రూ.43,750 లను డీడీల రూపంలో పశు సంవర్ధక శాఖకు చెల్లించారు.వడ్డీకి డబ్బులు తెచ్చి డీడీలు చెల్లించి ఏడాదిన్నర దాటినా నేటికీ గొర్రెల యూనిట్లు అందకపోవటంతో గొల్ల కురుమలు ఆందోళన చెందుతున్నారు.

కొత్త ప్రభుత్వం కొలువుదీరినా గొర్రెల యూనిట్లు పంపిణీపై ఊసెత్తకపోవడం తో అసలు గొర్రెలు ఇస్తారో లేదో నని గొల్ల కురుమలు అయోమయంలో పడ్డారు.

ఈ నేపథ్యంలో మండల, జిల్లా పశు వైద్యాధికారి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం నుండి ఆదేశాలు రాలేదని చెబుతున్నారని,డీడీలు చెల్లించిన వారు అంటున్నారు.ఇప్పటికైనా తమ పరిస్థితులను అర్థం చేసుకొని వెంటనే గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని కొత్త ముఖ్యమంత్రిని కోరుతున్నారు.

ఇదే విషయమై జిల్లా పశుసంవర్ధక అధికారి శ్రీనివాస్ ను వివరణ కోరగా ప్రభుత్వం నుండి ఆదేశాలు రాలేదని, మునుగోడు ఉప ఎన్నికల ముందు గొర్రెల పంపిణీ నిలిచిపోయిందని,డీడీలు చెల్లించిన వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెడతామని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube