తెలంగాణ నుంచే సోనియా పోటీ ? ఏ నియోజకవర్గం అంటే ..? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిచి తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది. బీఆర్ఎస్, బిజెపిల కంటే కాంగ్రెస్ వైఫై జనాల చూపు ఉందని, కచ్చితంగా మెజార్టీ స్థానాలను దక్కించుకుంటాము అనే నమ్మకంతో ఉన్నారు.

 Sonia Gandi Contest From Telangana Which Constituency , Sonia Gandi, Telangan-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థుల ఎంపిక పైనే ప్రధానంగా దృష్టి సారించారు.ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేశారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని( Sonia Gandhi ) కూడా తెలంగాణ నుంచి పోటీ చేయించాలనే పట్టుదలతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.ఈ మేరకు సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని టి.పిసిసి తీర్మానం చేసింది.తెలంగాణ నుంచి సోనియా గాంధీ ఎంపీగా పోటీ చేయిస్తే, ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని, అన్ని స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు.

కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల పైన ఆ ప్రభావం కనిపిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు.దీనిలో భాగంగానే సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించేందుకు నాలుగు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు.

దీంతో ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడ నుంచి సోనియా పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Telugu Brs, Congress, Indira Gandi, Karimnagar, Revanth Reddy, Tedlangana, Telan

కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి నుంచి సోనియాను పోటీ చేయించాలని చూస్తున్నారు.2019 ఎన్నికల్లో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth reddy )ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు.దీంతో సోనియా ఇక్కడి నుంచి పోటీ చేస్తే తిరుగు ఉండదని భావిస్తున్నారు.

అలాగే మెదక్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తున్నారు.ఇక్కడ నుంచి గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచారు.

దీంతో మెదక్ నుంచి బరిలో దిగేందుకు సోనియా ఆసక్తి చూపిస్తారని అంచనా వేస్తున్నారు.మెదక్ లో ప్రచారం చేయకపోయినా ఇందిరాగాంధీ గెలిచారు.ఇందిరను ఓడించేందుకు పదిమంది వరకు బలమైన నేతలు పోటీకి దిగినా ఇందిరాగాంధీ గెలుపును ఆపలేకపోయారు.2 లక్షల మెజారిటీ దక్కింది.

Telugu Brs, Congress, Indira Gandi, Karimnagar, Revanth Reddy, Tedlangana, Telan

ఇక మూడో ఆప్షన్ గా కరీంనగర్( Karimnagar ) ను పరిశీలిస్తున్నారు.తెలంగాణ ఏర్పాటుకు కరీంనగర్ సెంటిమెంట్ ను తెరపైకి తెస్తున్నారు.తెలంగాణ ఏర్పాటుపై మొదటిసారి సోనియా కరీంనగర్ నుంచి మాట్లాడారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణ ఇచ్చిన లీడర్ గా సోనియా గాంధీకి ఇక్కడ జనాల్లో సానుకూలత ఉందని, కరీంనగర్ నుంచి పోటీ చేసినా సోనియా గాంధీ సులువుగా గెలుస్తారని చెబుతున్నారు.

ఇక నాలుగో ఆప్షన్ గా చేవెళ్ల నియోజకవర్గం పరిశీలిస్తున్నారు.ఈ లోకసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉంది.ఇక్కడి నుంచి పోటీ చేస్తే మళ్లీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు.చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా రేవంత్ రెడ్డి ఉన్నారు.

సోనియా ఇక్కడి నుంచి పోటీ చేసే ఆలోచనతోనే రేవంత్ ను ఇంఛార్జిగా నియంనించారనే ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube