ధరలు తగ్గించే వరకు కాంగ్రేస్ ఆధ్వర్యంలో యుద్ధమే:డీసీసీ అధ్యక్షుడు వెంకన్న యాదవ్

సూర్యాపేట జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్,విద్యుత్ చార్జీలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని,పెంచిన ధరలను తగ్గించే వరకు రెండు ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు.ఆదివారం స్థానిక రెడ్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెంచిన ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 4వ తేదీన అంబేద్కర్ విగ్రహాల ముందు జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 Congress-led War Until Prices Come Down: Dcc President Venkanna Yadav-TeluguStop.com

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతూ,రైతులను నట్టేట ముంచుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.పూర్తి ధాన్యం కొనేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్ రావు,పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ,కెక్కిరేణి శ్రీనివాస్,కుందమల్ల శేఖర్, నాగుల వాసు,కర్ణాకర్ రెడ్డి,ఐలమల్లు,నరేందర్ నాయుడు,రాము తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube