Suryapet : రైతాంగానికి వెంటనే రుణమాఫీ చేయాలి:సిపిఎం

కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం మండల పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో జరిగిన సిపిఎం గ్రామశాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీ( Loan Waiver ) కాకపోవటంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 Farmers Should Be Given Immediate Loan Waiver Cpm-TeluguStop.com

ఎన్నికల హామీ ప్రకారం రెండు లక్షల లోపు రుణాలు( Loans ) అన్నిటినీ మాఫీ చేయాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు( Raithu bandhu ) డబ్బులు కేవలం మూడు ఎకరాలకు మాత్రమే ఇచ్చారని, మిగిలిన రైతులకు రైతుబంధు విడుదల చేయాలని కోరారు.

ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి అవిరే అప్పయ్య,మండల కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు,తండ చంద్రయ్య,పార్టీ సభ్యులు మాణిక్యం,దేవరకొండ భిక్షం,మురపాక సైదులు, ఏరగాని సైదులు,కానుగు దుర్గయ్య,ఐలయ్య, మామిడి లింగయ్య, పిడమర్తి నరసయ్య,కవిత పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube