సూర్యాపేట జిల్లా:గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS party )ఏమి అభివృద్ధి సాధించారని దశాబ్ది ఉత్సవాల పేరుతో సంబురాలు జరుపుతున్నారని ఏఐకెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి.కోటేశ్వరరావు( V.Koteswara Rao) ప్రశ్నించారు.మంగళవారం సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సభకు ఆయన ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారన్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి 20 ప్రశ్నలతో చార్జ్ సీటు తయారు చేశామని,వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దళిత ముఖ్యమంత్రి ఏమయ్యాడు?దళితులకు మూడు ఎకరాల భూమి ఎటు పోయింది?డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎంతమందికి ఇచ్చారు? ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు?అన్ని రకాల పరీక్ష పత్రాల లీకేజీ ఎందుకు జరుగుతున్నవి? ఈ లీకేజీలో లక్షల కుంభకోణం ఎవరు చేశారు?రైతు రుణమాఫీ నేటికీ ఎందుకు అమలు చేయలేదు? పంటల భీమా ఎందుకు అమలు కావడం లేదు? తెలంగాణలో గృహహింస దేశంలో రెండవ స్థానంలో ఉన్నది నిజం కాదా? మద్యంపై వచ్చిన ఆదాయం పైనే రాష్ట్ర సాధన కొనసాగించడం వాస్తవం కాదా? తెలంగాణలో రోగం కంటే వైద్య ఖర్చు ప్రమాదకరంగా మారింది వాస్తవం కాదా? సూపరిపాలనలో ఫ్రెండ్లీ పోలీసులు 34 కస్టడీ మరణాలు జరిగినవి వాస్తవం కాదా? పోడు ఇవ్వక పోతివి గూడు లేకుండా చేస్తే ఇవన్నీ మీ పాలనలో జరిగినది వాస్తవం కాదా? ఇందుకేనా దశాబ్ది సంబరాలు జరుపుకునేదని అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, ఐఎఫ్ టియు జిల్లా కార్యదర్శి గంట నాగయ్య( Ganta Nagaiah ), ఏఐకెఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు పి.లక్ష్మయ్య,పివైఎల్ జిల్లా కార్యదర్శి సైదులు,ఐఎఫ్ టియు జిల్లా ఉపాధ్యక్షులు కారింగుల వెంకన్న,జిల్లా నాయకులు అలుగుబెల్లి వెంకటరెడ్డి,అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి,పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు పోలెబోయిన కిరణ్, దశరథ,నర్సిరెడ్డి, వీరేబోయిన రమేష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.







