ఏంటో ఈ మీడియా గోల ఒక పట్టాన అర్ధం కాదు.నిన్న ఉపాసన అపోలో ఆసుపత్రి లో చేరింది మొదలు మెగా వారసుడి కోసం ముహూర్తం ఖరారు అంటూ అన్ని మీడియా చానెల్స్ గగ్గోలు పట్టాయి.
ఇక పాపా పుట్టిందో లేదో మరొక హడావిడి.ఎప్పుడు పుట్టింది, ఏ టైం కి పుట్టింది, ఎవరి పోలికలతో ఉంది అంటూ నానా రచ్చ ఇప్పటికే మొదలయ్యింది.
సరే కొంత మేర ఆ అత్యుత్సాహాన్ని ఓపిక పడితే కొన్ని వెబ్ సైట్స్ ఉపాసన డెలివరీకి ముందే పుట్టేది ఎవరో చెప్పేసారు.ఇక మరి ముఖ్యంగా ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది.
చిరంజీవి కి( Chiranjeevi ) ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కొడుకు.
పెద్ద కూతురు సుష్మిత కు ఇద్దరు కుమార్తెలు అలాగే రెండో కూతురు శ్రీజకు కూడా ఇద్దరు కుమార్తెలు.ఇప్పుడు రామ్ చరణ్( Ram Charan ) మరియు ఉపాసన ( Upasana ) దంపతులు అయినా మోగా పిల్లాడిని కంటారేమో అని అయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారట.కానీ మళ్లి ఆడపిల్ల అంటూ కామెంట్స్ వినిపించాయి.
ఈ పాపా తో కలిపి చిరంజీవి కి ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు.కొడుకు పుట్టలేదని ఒక వర్గం తెగ చించుకుంటుంది.
ఎవరు అయితే ఏముంది చిరు మాత్రం చాల సంతోషంగా ఉన్నారు.తన మనవరాలు ఇంటికి అదృష్టాన్ని తెచ్చిందని సంతోష పడుతున్నారు.
ఇది అంత ఒక ఎత్తు అయితే పుట్టిన బిడ్డ ఇంకా కళ్ళు కూడా తెరిచిందో లేదో ఆమె బారసాల ఎప్పుడు.ఆమె సినిమాల్లోకి వస్తుందా అంటూ పిచ్చి పిచ్చి వార్తలు కూడా కనిపిస్తున్నాయి.
మన మీడియా ఇంత హడావిడి చేస్తుంది కాబట్టి అందరికి మీడియా అంటే నమ్మకం పోతుంది.ఒక వార్త వస్తే అది సమాజానికి ఉపయోగ పడాలి.లేదంటే దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.ఈ మధ్య కాలంలో అయితే మరి దిగజారుడు వ్యాఖ్యలు రాయడం మరి అలవాటై పోయింది.ప్రతి ఒక్కరు రిపోర్టర్ అన్నట్టుగానే రెచ్చిపోయి ఎవరికీ వారు కొత్త వార్తలను ఇష్టం వచ్చినట్టు వండి వార్చేస్తున్నారు.ఈ దూకుడుకు కళ్లెం వేసే ఒక సెన్సార్ లేకపోవడం వల్లే ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఏది ఏమైనా కొత్తగా తల్లిదండ్రులు అయినా ఉపాసన రామ్ చరణ్ లకు కంగ్రాట్స్.