విశాఖ కీచక స్వామిజీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా కీలక విషయాలు బయటకు వచ్చాయి.
బాలికపై అత్యాచారానికి సంబంధించి ఆధారాలు లభించాయని తెలిపారు.
అంతేకాకుండా సాక్ష్యాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు స్వామిజీ ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.
అనంతరం స్వామిజీ ఆశ్రమం నుంచి 12 మందిని బాల సంరక్షణ గృహానికి తరలించారు.అయితే గతంలోనూ స్వామిజీపై అత్యాచారం కేసు నమోదు అయిందని పోలీసులు వెల్లడించారు.
కాగా స్వామిజీ లైంగిక వేధింపులు తాళలేక ఓ బాలిక ఈనెల 13న ఆశ్రమం నుంచి బయటకు వచ్చింది.అయితే బాలిక కనబడటం లేదంటూ 15వ తేదీన స్వామిజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో బాలిక ఫిర్యాదుతో స్వామిజీ వ్యవహారం బయటకు వచ్చింది.