ముహూర్తపు సిజరింగ్,లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు నిర్దారణ.అడ్డంగా దొరికిపోయిన సాయి దీప్తి నర్సింగ్ హోమ్.
హాస్పిటల్ సీజ్ చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.
సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని సాయి దీప్తి నర్సింగ్ హోమ్ హాస్పిటల్ లో ముహూర్తపు సిజరింగ్, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని సమాచారం రావడంతో వెంటనే స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటా చలం ఆధ్వర్యంలో వైద్యాధికారుల బృందం సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో హాస్పిటల్ లో ముహూర్తపు సిజరింగ్,లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు నిర్దారణ కావడంతో వెంటనే హాస్పటల్ ను సీజ్ చేసిన డిఎం అండ్ హెచ్ ఓ వారిపై చర్యలకు ఆదేశించారు.