కాంగ్రెస్ దెబ్బకు దిగొచ్చిన కేసీఆర్ సర్కార్:చెవిటి వెంకన్న యాదవ్,డీసిసి ప్రెసిడెంట్

సూర్యాపేట జిల్లా:వరి ధాన్యాలు కొనుగోలు చేస్తామంటూ కేసీఆర్ సర్కార్ ప్రకటిండం కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఆందోళనలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించక తప్పలేదన్నారు.

 Kcr Govt Defeated By Congress: Deaf Venkanna Yadav, Dcc President-TeluguStop.com

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి,రైతు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందని పేర్కొన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా పెట్రోలు,డీజిల్,గ్యాస్ ధరలు,విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల వద్దకు దిగి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తుదని,ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాల మెడలు వంచే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు.రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళల తోడు ఉంటుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube