సంక్షేమ హాస్టల్లో సమస్యలపై కెవిపిఎస్ ఆధ్వర్యంలో సర్వే

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సమస్యలపై కెవిపిఎస్( KVPS ) ఆధ్వర్యంలో ఈనెల ఆరో తేదీ నుండి 15వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నట్లు కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి తెలిపారు.శనివారం జిల్లా కేంద్రంలోని సంఘం భవనంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.

 Survey Under Kvps On Problems In Welfare Hostels , Welfare Hostels, Survey Under-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో సమస్యలపై జిల్లా వ్యాప్తంగా సర్వేలు నిర్వహించి,పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.

అనేక హాస్టల్లో సొంత భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,జిల్లా వ్యాప్తంగా సమస్యలపై సర్వేలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వరున్నట్లు తెలిపారు.ఈసమావేశంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు,టేకుల సుధాకర్, జిల్లా సహాయ కార్యదర్శి పిండిగ నాగమణి,జిల్లా కమిటీ సభ్యులు ఇరుగు రమణ,పేరం బాలస్వామి, కోదాటి సైదులు,గిరి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube