సూర్యాపేట జిల్లా:ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది( Krishna River ) పరుగులు పెడుతూ శ్రీశైలం ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 30న శ్రీశైలం క్రస్ట్ గేట్లను ఏపీ ప్రభుత్వం ఎత్తనున్నట్లు తెలుస్తుంది.
దీంతో నాగార్జునసాగర్ కు వరద ప్రవాహం భారీగా వచ్చే అవకాశముందని ఎడమ కాలువ ఆయకట్టు రైతుల ఆశలు చిగురించి, కళ్ళలో ఆనందం కనిపిస్తుంది.ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు.
నార్లు పోయడం,దుక్కులు దున్నడం లాంటి పనుల్లో నిమగ్నం అవుతున్నారు.ఇప్పటికే బోర్లు,బావుల ఆధారంతో కొంత మంది రైతులు నాట్లు వేసే క్రమంలో ఉన్నారు.
నాగార్జునసాగర్ కి భారీగా వరద నీరు వచ్చి డ్యాం పూర్తిస్థాయిలో నిండితే, ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటితో మెట్ట పొలాలు సైతం పూర్తి స్థాయిలో వరిసాగు చేసే అవకాశం కనిపిస్తుంది.