వివాదాస్పదంగా మారిన జిల్లా ఎస్పీ వ్యాఖ్యలు

సూర్యాపేట జిల్లా:సెప్టెంబర్17 జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీ ముగింపు సభలో జిల్లా ఎస్పీ ఎస్.

 District Sp's Comments That Became Controversial-TeluguStop.com

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మీ అందరికీ ఆకలి అవుతుందా? అంటూ శ్రీశ్రీ మాటలు వినిపించారు.అయితే మనం భోజనానికి వెళ్దాం కానీ, ఇప్పుడు నేను జయహో మంత్రి జగదీష్ రెడ్డి అంటే మీరంతా జయహో అని అనాలని చెప్పడంతో అంతా షాక్ కి గురయ్యారు.

ఎస్పీ వ్యవహార శైలిని చూసిన ర్యాలీకి హాజరైన ప్రజలు ఇదేంటని చెవులు కోరుకున్నారు.విషయం తెలిసిన ప్రతిపక్ష పార్టీల నేతలు ఎస్పీ తీరుపై మండిపడుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ లు,ఐపీఎస్ లు అధికారులుగా కాకుండా టీఆర్ఎస్ నాయకుల్లా పని చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube