సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణం మిర్యాలగూడ రోడ్డులోని సిఐటియు కార్యాలయాన్ని కొందరు అవినీతి అధికారుల సహకారంతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని అరెస్టు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సోమయ్య గౌడ్ డిమాండ్ చేశారు.బుధవారం సిఐటియు కార్యాలయంలో శీలం శ్రీను అధ్యక్షతన జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో అయన మాట్లాడుతూ అసంఘటత కార్మికుల సమస్యల పరిష్కారాల కోసం ఉపయోగించుకునే సిఐటియు కార్యాలయ స్థలాన్ని అధికారుల సహకారంతో సెల్ఫ్ అసెస్మెంట్ పేరుతో పోతన బోయిన వెంకన్న పేరున నమోదు చేసుకొని అనంతరం శీతల మణి రోషపతి అనే వ్యక్తులు సుమారు 750 గజాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు.
అక్రమ రిజిస్ట్రేషన్ కు సహకరించిన మున్సిపల్ కమిషనర్ అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.రానున్న రోజుల్లో కార్మికుల ఆస్తుల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చింతకాయల పర్వతాలు, ఇంటి తిరపయ్య మొలకలపల్లి శ్రీను,శీలం రాంబాబు,కస్తాల శాంతయ్య,ములకలపల్లి వెంకటనారాయణ,రవి, వెంకన్న,సైదులు తదితరులు పాల్గొన్నారు.