ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

సూర్యాపేట జిల్లా:ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం ఆధ్వర్యంలో ప్రజలకు,వాహన చోదుకులకు ఏటువంటి ఇబ్బందులు లేకుండా ఏప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రణ కొరకు అనేక రకాలుగా చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.

 Everyone Must Obey Traffic Rules Traffic Si Sairam, Traffic Rules, Traffic Si S-TeluguStop.com

ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా పట్టణంలోకి వచ్చిన మరో భారీ వాహనానికి బుధవారం జరిమానా విధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వాహనాలకు టౌన్ పరిధిలోకి ఉదయం తొమ్మిది గంటల దాటిన తర్వాత అనుమతి లేకపోయినా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి

టౌన్ లోకి లోడింగ్ తో వచ్చిన భారీ వాహనానికి ట్రాఫిక్ ఎస్ఐ రూ .2,400 జరీమన విధించారు.జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ కొరకు సమిష్టిగా పని చేస్తున్నామని తెలిపారు.

భారీ వాహనాలకు ఉదయం తొమ్మిది దాటిన తర్వాతకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని తేల్చి చెప్పారు.ఐనాసరే కొంతమంది నిబంధనలు అతిక్రమించి టౌన్ లోకి రావడంతో అనేక రకాలుగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందన్నారు.

పట్టుబడి జరిమానా విధించిన వాహనాలు రెండవసారి నిబంధనలు అతిక్రమిస్తే సంబంధిత వ్యాపారి మీద కూడా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube