సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మండలం వేపల సింగారంలో మూఢనమ్మకాలు,సైబర్ నేరాలు, గంజాయితో జీవితాలు ఎలా చిత్తు అవుతున్నాయో లాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కలిపించడం కోసం జిల్లా ఎస్పి ఆదేశాలతో కళా బృందంతో అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ ఎస్ఐ కట్టా వెంకటరెడ్డి హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ఎస్ఐ కట్టా వెంకటరెడ్డి మాట్లాడుతూ సైబర్ క్రైమ్,హెల్మెట్,సీట్ బెల్ట్,మైనర్ల డ్రైవింగ్, గంజాయి దుష్పరిణామాలు మీద అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి,పోలీసు కళా బృందం వారు,ప్రజలు పాల్గొన్నారు.