సూర్యాపేట జిల్లా:వర్షాభావం వల్ల అనాధల ఆకలిని దృష్టిలో పెట్టుకొని వివిధ ఆశ్రమాలలో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులకు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ.ఆంజనేయులు ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా అల్పాహారం అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
శుక్రవారం దురాజ్ పల్లిలోని ఆలేటి ఆటం,వివేకానంద వృద్దాశ్రమం,కాసరబాద క్రాస్ రోడ్డులోని అపూర్వ బధిరుల పాఠశాల,కొత్త బస్టాండ్ ఫ్లై ఓవర్ క్రింద ఉండే అనాధలు,వృద్ధులు, వికలాంగులు,నిరాశ్రయులు ఆకలితో అలమటించవద్దనే ఆలోచనతో సొంత ఖర్చులతో వారికి సకాలంలో అల్పాహారం అందించారు.స్వయంగా ఆయనే వెళ్లి వారికి అల్పాహారం వడ్డించి వారితో కొంత సమయాన్ని గడిపి,వారి పూర్వపరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సమాజంలో ఎంతో మంది ఆశ్రయం లేకపోవడంతో పాటు ఆకలితో బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అటువంటి వారిని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు.
అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న అన్న నానుడితో తాను తవ వంతుగా కొంతమందికైనా ఈరోజు ఆకలి తీర్చడం సంతృప్తిని ఇచ్చిందన్నారు.